బట్లర్ 55 బంతుల్లో 110 నాటౌట్


Sun,May 12, 2019 01:15 AM

Buttler
సౌతాంప్టన్: జోస్ బట్లర్ (55 బంతుల్లో 110 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తోలి మ్యాచ్ రద్దుకాగా.. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మోర్గన్ సేన 50 ఓవర్లలో 3 వికెట్లకు 373 పరుగులు చేసింది. బట్లర్‌తో పాటు మోర్గన్ (48 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), రాయ్ (98 బంతుల్లో 87, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), బెయిర్‌స్టో (51; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఛేదనలో ఫఖర్ జమాన్ (106 బంతుల్లో 138; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయడంతో ఒకదశలో సునాయాసంగా గెలుస్తుందనిపించినా.. చివర్లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 361 పరుగులకు పరిమితమైంది.

182

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles