హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్ జో రూట్ (441 బంతుల్లో 226; 22 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీతో చెలరేగడంతో.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 269/5తో నాలుగోరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లిష్ జట్టును సారథి ముందుండి నడిపించాడు. అతడికి యువ ఆటగాడు ఓటీ పోప్ (202 బంతుల్లో 75; 6 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. జట్టు స్కోరు 24/2తో ఉన్న సమయంలో క్రీజులో అడుగుపెట్టిన రూట్ 11 గంటలకు పైగా క్రీజులో నిలిచి 458 పరుగుల వద్ద పెవిలియన్ చేరడం విశేషం. రూట్ మారథాన్ ఇన్నింగ్స్‌కు పోప్ సంయమనం తోడవడంతో.. ఇంగ్లండ్‌కు 101 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కివీస్ బౌలర్లలో వాగ్నర్‌కు 5 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ విలియమ్సన్ (37), టేలర్ (31) క్రీజులో ఉన్నారు. మంగళవారం ఆటకు ఆఖరిరోజు.