జెరెమీ సంచలనం


Fri,July 12, 2019 03:02 AM

lalrinuga
అపియా(సమోవా): భారత యువ వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుంగ సంచలనం సృష్టించాడు. కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా మూడు కొత్త రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గురువారం 67కిలోల స్నాచ్ విభాగంలో బరిలోకి దిగిన ఈ 16 ఏండ్ల యువ వెయిట్‌లిఫ్టర్ 136 కిలోల బరువు ఎత్తి యూత్ వరల్డ్, ఆసియా, కామన్వెల్త్ రికార్డులను తిరుగరాశాడు. గత ఏప్రిల్‌లో చైనాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 134 బరువు ఎత్తి యూత్ వరల్డ్, ఆసియా రికార్డును జెరెమీ సవరించిన సంగతి తెలిసిందే. సమోవాలో జరుగుతున్న ప్రస్తుత కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్నాచ్‌లో అదరగొట్టిన జెరెమీ..క్లీన్ అండ్ జెర్క్‌లో రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా టోక్యో(2020) ఒలింపిక్స్‌కు ర్యాంకింగ్స్‌ను ప్రకటించనున్నారు. టోర్నీలో భారత్‌కు నాలుగు స్వర్ణాలు సహా రెండు రజతాలు, ఒక కాంస్య పతకం దక్కాయి. పురుషుల 73కిలోల విభాగంలో అచింతా సెహులీ 305 కిలోలతో స్వర్ణం సాధించగా, మన్‌ప్రీత్‌కౌర్(207కి) పసిడి అందుకుంది.

193

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles