సుహానాకు స్వర్ణం


Tue,February 13, 2018 01:16 AM

న్యూఢిల్లీ: ఐటీటీఎఫ్ ప్రీమియం సర్క్యూట్‌లో భాగంగా జరిగిన ఒమన్ జూనియర్ అండ్ క్యాడెట్ ఓపెన్‌లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సుహానా సైనీ స్వర్ణంతో మెరిసింది. సోమవారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సుహానా 3-1 (10-12, 11-7, 11-6, 11-8)తో హనా (ఈజిప్టు)పై గెలిచింది. ఆరంభంలో కాస్త తడబడినా.. తర్వాతి సెట్లలో అటాకింగ్ ఆటతీరుతో అదురగొట్టింది. లీగ్ దశలో రినాద్ ఎల్ హసనీ (జోర్డాన్), హెండ్ జజా (సిరియా)లపై వరుస గేమ్‌ల్లో గెలిచింది. సెమీస్‌లో భారత్‌కు చెందిన అనన్యా చండేని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

166

More News

VIRAL NEWS