మిరాజ్ గురి తప్పింది..


Sun,May 12, 2019 01:09 AM

mairaz
చాంగ్వాన్(దక్షిణకొరియా): ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్‌లో భారత షూటర్ మిరాజ్ అహ్మద్‌ఖాన్ గురి తప్పింది. శనివారం జరిగిన స్కీట్ విభాగం అర్హత రౌండ్‌లో మిరాజ్ 125 పాయింట్లకు 121 పాయింట్లు సాధించి ప్రధాన రౌండ్‌లోకి ప్రవేశించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. అర్హత రౌండ్‌లో 24, 25, 23 స్కోర్లతో ఆకట్టుకున్న అహ్మద్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇదే విభాగంలో రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్ విన్సెంట్ హన్‌కాక్ పసిడి పతకంతో మెరిసాడు. మిరాజ్‌తో పాటు బరిలోకి దిగిన భారత షూటర్ షిరాజ్ షేక్ 33వ స్థానంతో నిరాశపరిచాడు.

147

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles