సరబ్‌జ్యోత్‌కు స్వర్ణం


Fri,July 19, 2019 03:10 AM

singh
షుల్(జర్మనీ): జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో సరబ్‌జ్యోత్ సింగ్ స్వర్ణ పతకంతో మెరిశాడు. గురువారం పురుషుల 10మీటర్ల ఎయి ర్ పిస్టల్ విభాగం ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శనతో సరబ్‌జ్యోత్ భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. 575 స్కోరుతో ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించిన ఈ 17 ఏండ్ల యువ షూటర్..చైనా షూటర్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో హోరాహోరీగా సాగిన పోరులో పైచేయి సాధిస్తూ పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో భారత్ ప్రస్తుతం తొమ్మిది స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, నాలుగు కాంస్యాలతో టాప్‌లో కొనసాగుతున్నది.

258

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles