న్యూఢిల్లీ: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు కెప్టెన్‌గా జార్ఖండ్ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. ఈనెల 18 నుంచి మూడు రోజుల పాటు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బోర్డు జట్టుకు ఇషాన్ నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నందున కొంత మంది ఆటగాళ్లను ఎంపిక చేయలేకపోయారు. వేర్వేరు జట్ల తరఫున మెరుగ్గా రాణించిన పప్పురాయ్, ముంబై స్పీడ్‌స్టర్ తుషార్ దేశ్‌పాండే, ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్ బోర్డు జట్టులో చోటు దక్కించుకున్నారు.