ఇరానీ విజేత విదర్భ


Sun,February 17, 2019 01:39 AM

vidarbha
నాగ్‌పూర్: ఇరానీ కప్‌లో విదర్భ విజేతగా(తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో) నిలిచింది. ఇలా వరుసగా రెండు సీజన్లలో రంజీ ట్రోఫీతో పాటు ఇరానీ కప్‌ను దక్కించుకున్న మూడో జట్టుగా విదర్భ రికార్డు నెలకొల్పింది. గతం లో ముంబై, కర్ణాటక ఈ ఫీట్ అందుకున్నా యి. 280 పరుగుల లక్ష్యఛేదన కోసం ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 37/1తో ఆట కొనసాగించిన విదర్భ 5 వికెట్లకు 269 పరుగులు చేసింది. అథర్వ తైదె(72), గణేశ్ సతీశ్(87) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. సెంచరీతో రాణించిన అక్షయ్ కర్నెవార్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. విజేతగా తమకు వచ్చిన ప్రైజ్‌మనీని పుల్వామాలో మరణించిన జవాన్ల కుటుంబాలకు విరాళమిస్తున్నట్లు విదర్భ కెప్టెన్ ఫయాజ్ ఫజల్ ప్రకటించాడు.

336
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles