ఐపీఎల్ వేడుకలు రద్దు


Sat,February 23, 2019 04:30 AM

-పుల్వామా వీర జవాన్లకు బీసీసీఐ విరాళం
ipl
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు బాసటగా నిలిచేందుకు బీసీసీఐ మరోమారు ముందుకొచ్చింది. ఇప్పటికే ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించిన బీసీసీఐ తాజాగా ఐపీఎల్ వేడుకలను రద్దు చేసింది. ఉగ్రదాడికి సంతాప సూచకంగా ఐపీఎల్ 12వ సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు క్రికెట్ పరిపాలన కమిటీ(సీవోఏ) శుక్రవారం ప్రకటించింది. ఆరంభోత్సవానికయ్యే ఖర్చును సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు విరాళమిచ్చేందుకు సీవోఏ నిర్ణయించింది. ఈ యేడాది ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేస్తు న్నాం. దానికయ్యే ఖర్చును సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. శుక్రవారం జరిగిన భేటీలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం అని సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. మరోవైపు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పందిస్తూ జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలన్న సీవోఏ నిర్ణయం చాలా గొప్పది. గతేడాది ప్రారంభోత్సవానికి 15 కోట్లు బడ్జెట్‌ను కేటాయించాం. దాదాపు అంతే మొత్తాన్ని జవాన్లకు ఇవ్వనున్నాం అని అన్నారు. బాలీవుడ్ తారల తళుకుల మధ్య గత సీజన్ ఐపీఎల్ ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

781

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles