చెన్నైకే ధోనీ


Thu,December 7, 2017 03:16 AM

-రిటేన్ పాలసీకి ఐపీఎల్ జీసీ ఓకే
- ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు
dhoni
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కారణంగా రెండేండ్ల నిషేధానికి గురైన చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌కు మళ్లీ ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు బుధవారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) ఇందుకు ఆమోదం తెలిపింది. బీసీసీఐ పరిపాలన కమిటీ (సీవోఏ) కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ఐపీఎల్-2018కు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్ల రిటేన్, ఫ్రాంచైజీల బడ్జెట్, నిబంధనల వంటి అంశాలపై చర్చించారు.
- 2015లో ఆడిన జట్టులో నుంచి ఐదుగురు ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకునేందుకు చెన్నై, రాజస్థాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ముగ్గుర్ని రిటేన్ చేసుకుని, రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎమ్) కార్డు ద్వారా ఇద్దర్ని తీసుకోవచ్చు. లేదంటే ఇద్దర్ని రిటేన్ చేసుకుని, ముగ్గుర్ని ఆర్‌టీఎమ్ ద్వారా అట్టిపెట్టుకోవచ్చు. అన్ని ఫ్రాంచైజీలకు ఇది వర్తిస్తుంది.
- ఆర్‌టీఎమ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. వేలంలో తమ ఫ్రాంచైజీకి చెందిన ఆటగాడిని రెండో ఫ్రాంచైజీ కొనుగోలు చేసినప్పుడు ఆర్‌టీఎమ్ ద్వారా అతన్ని తీసుకోవచ్చు. అయితే వేలంలో రెండో ఫ్రాంచైజీ అతనికి ఎంత డబ్బు ఇస్తుందో ఆ మొత్తాన్ని మొదటి ఫ్రాంచైజీ చెల్లించాలి.
- అట్టిపెట్టుకునే ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురు భారత్, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండాలి. ఒకవేళ ఫ్రాంచైజీలు ఎవర్ని అట్టిపెట్టుకోకుంటే.. 2018 వేలంలో వాళ్లకు మూడు రైట్ టు మ్యాచ్ కార్డు అవకాశాలు లభిస్తాయి.
- ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లను కలుపుకుని ప్రతి జట్టులో గరిష్టంగా 25, కనిష్టంగా 18 మంది ప్లేయర్లకు ఉండొచ్చు.
- ఫ్రాంచైజీ జీతాల బడ్జెట్‌ను రూ. 66 కోట్ల నుంచి రూ. 85 కోట్లకు పెంచారు. 2018లో రూ. 80 కోట్లు, 2019లో 82 కోట్లు, 2020లో రూ. 85 కోట్లు ఖర్చు చేయాలి. ప్రతి సీజన్‌లో కనీసం 75 శాతం బడ్జెట్‌ను వినియోగించాలి. క్యాప్‌డ్ ప్లేయర్లకు కనీస మద్దతు ధర రూ. 75 లక్షలు, అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు రూ. 40లక్షలు చెల్లించాలి.
- ముగ్గురు ఆటగాళ్లను రిటేన్ చేసుకుంటే ఫ్రాంచైజీ బడ్జెట్‌లో రూ. 33 కోట్లు కోత పడుతుంది. మిగతా రూ. 47 కోట్లను వేలానికి వినియోగించుకోవచ్చు. మొదటి రిటేన్ ప్లేయర్‌కు రూ. 15 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 11 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 7 కోట్లు చెల్లించాలి.

868

More News

VIRAL NEWS