ముగిసిన భారత పోరు


Sun,July 21, 2019 01:50 AM

వ్లాదివోస్తోక్(రష్యా): రష్యా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ పోరులో భారత్ ద్వయం ధృవ్ కపిలా, జక్కంపూడి మేఘన 6-21, 15-21తో ఇండోనేషియా జోడీ అద్నాన్ మౌలానా, మిచెల్లీ క్రిస్టి చేతిలో ఓటమిపాలైంది. 27 నిమిషాల్లోనే ముగిసిన పోరులో భారత షట్లర్లు ఏ మాత్రం పోరాట పటిమ కనబరుచలేకపోయారు. మరోవైపు మహిళల డబుల్స్‌లో మేఘన, పూర్వీశ రామ్ జోడీ 10-21, 8-21తో జపాన్ ద్వయం మికీ కశీహర, మియుకి కటో చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

267

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles