న్యూజిలాండ్ చేరుకున్న కోహ్లీసేన


Mon,January 21, 2019 01:37 AM

ఆక్లాండ్: మూడు వారాల పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు ఆదివారం న్యూజిలాండ్‌కు చేరుకుంది. అభిమానుల కేరింతల మధ్య ఆక్లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో టీమ్‌ఇండియా క్రికెటర్లు కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించారు. మరోవైపు కెప్టెన్ విరాట్‌కోహ్లీ, అనుష్కశర్మ కనబడగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా అరుపులు, కేకలతో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించుకున్న కోహ్లీసేన కివీస్‌లోనూ జోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నది. టూర్‌లో భాగంగా కివీస్‌తో భారత్ ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈనెల 23న నేపియర్‌లో టీమ్‌ఇండియా తొ లి వన్డే మ్యాచ్ ఆడుతుంది. వచ్చే నెల 10న హామిల్టన్‌లో జరిగే టీ20తో జట్టు పర్యటన పూర్తవుతుంది.

436

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles