టైమ్స్ 100నెక్ట్స్‌లో ద్యుతి


Thu,November 14, 2019 12:28 AM

dutee
న్యూఢిల్లీ: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు టైమ్స్ 100 నెక్ట్స్ జాబితాలో చోటు దక్కింది. వ్యాపార, వినోద, క్రీడా, రాజకీయ, సామాజిక ఉద్యమ, ఆరోగ్య, విజ్ఞాన, రంగాల్లో స్టార్లుగా ఎదుగుతూ ఆయా రంగాల అభివృద్ధికి పాటుపడుతున్న 100 మందితో కూడిన జాబితాను టైమ్స్ మ్యాగజీన్ బుధవారం విడుదల చేసింది. ప్రపంచ అత్యంత ప్రభావశీలుర జాబితా టైమ్స్ 100 లిస్ట్‌కు అదనంగా దీన్ని తీసుకొచ్చింది. ఈ జాబితాలో తనకు చోటు దక్కడంపై ద్యుతీ సంతోషం వ్యక్తం చేసింది. టైమ్స్ మ్యాగజీన్ నుంచి వచ్చిన గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉన్నా. లింగ సమానత్వంపై నమ్మకంతో ఉన్నా. క్రీడల్లో, సమాజంలో బాలికలు, మహిళల హక్కుల కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తా అని ద్యుతీ ట్వీట్ చేసింది. గతేడాది జరిగిన జకర్తా ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో రెండు రజత పతకాలు సాధించిన ద్యుతీ.. ఈ ఏడాది ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో స్వర్ణం చేజిక్కుంచుకొని.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా స్ప్రింటర్‌గా రికార్డు సృష్టించింది.

267

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles