టోక్యోకు గురి అదిరింది


Mon,November 11, 2019 03:48 AM

shhot

-ఒలింపిక్స్‌కు మరో ముగ్గురు భారత షూటర్లు..
-మొత్తంగా రికార్డు స్థాయిలో 15మంది అర్హత

దోహా : ఆసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు షూటర్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. దీంతో విశ్వక్రీడల్లో చోటు దక్కించుకున్న భారత షూటర్ల సంఖ్య 15కు చేరగా.. చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో 12మంది షూటర్లు పాల్గొనడమే ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల స్కీట్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అంగద్ వీర్‌సింగ్‌తో పాటు రజతం చేజిక్కించుకున్న మైరాజ్ అహ్మద్ ఖాన్ టోక్యో టికెట్ దక్కించుకున్నారు. అంతకు ముందు జరిగిన పురుషుల 50మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ విభాగంలో కాంస్యం సాధించిన 18ఏండ్ల ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ సైతం విశ్వక్రీడకు క్వాలిఫై అయ్యాడు. స్కీట్ విభాగం ఫైనల్లో 56 పాయింట్లతో భారత షూటర్ల మధ్య టై కావడంతో స్వర్ణం కోసం షూటౌట్ జరుగగా అంగద్ 6-5తేడాతో అహ్మద్‌ను ఓడించి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు జరిగిన 50మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఫైనల్‌లో 449.1పాయింట్లతో మూడో స్థానం లో నిలిచిన తోమర్ కాంస్యం సహా ఒలింపిక్స్ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. 10మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత షూటర్లు మనూ బాకర్ - అభిషేక్ వర్మ స్వర్ణం సాధించగా.. ఫైనల్లో వారి చేతిలో ఓడిన సౌరభ్ చౌదరి - యశస్వి సింగ్ దేశ్వాల్ రజతంతో సరిపెట్టుకున్నారు.

240

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles