పతకాల గురి


Thu,November 7, 2019 03:24 AM

kynan
దోహా: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ రెండో రోజు భారత షూటర్లు ఎనిమిది పతకాలతో అదరగొట్టారు. అయితే, టోక్యో ఒలింపిక్స్ (2020)కు మాత్రం అర్హత సాధించలేకపోయారు. బుధవారం జరిగిన పురుషుల ట్రాప్ విభాగంలో హైదరాబాదీ షూటర్ కైనన్ చెనాయ్ నిరాశపరిచాడు. పురుషుల ట్రాప్ విభాగంలో ఆరో స్థానంలో నిలిచి టోక్యోకు అర్హత సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ట్రాప్ టీమ్ విభాగంలో భారత త్రయం అనిశ్, భవేశ్ షెకావత్, ఆదర్శ్ సింగ్ 357 పాయింట్లు చేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తంగా రెండో రోజు సీనియర్ విభాగంలో భారత షూటర్లు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాం స్యాలు సాధిస్తే.. జూనియర్ విభాగంలో రెం డు పసిడి పతకాలు దక్కాయి.

146

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles