బ్రిడ్జ్‌లో కాంస్యం


Tue,October 8, 2019 02:40 AM

ముంబై: ప్రపంచ బ్రిడ్జ్‌ చాంపియన్‌షిప్‌లో భారత సీనియర్‌ జట్టు కాంస్య పతకం సాధించింది. దీపక్‌ సారథ్యంలోని జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చిందని భారత బ్రిడ్జ్‌ సమాఖ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల చైనా వేదికగా జరిగిన 44వ వరల్డ్‌ బ్రిడ్జ్‌ చాంపియన్‌షిప్‌లో దీపక్‌, జితేంద్ర సోలాని, సుభాశ్‌, శ్రీధరన్‌, సుబ్రతా సాహా, సుకమల్‌ దాస్‌తో కూడిన జట్టు మూడోస్థానంలో నిలిచింది. రెండేండ్ల క్రితం ఫ్రాన్స్‌ వేదికగా జరిగిన పోటీల్లో నాలుగోస్థానంలో నిలిచిన భారత జట్టు ఈ సారి మెరుగైన ప్రదర్శన చేసింది.

403

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles