హాజరు లేదని ఉద్యోగం ఊడగొట్టారు!


Sat,May 20, 2017 12:39 AM

తిరువనంతపురం: హాజరు శాతం తక్కువగా ఉందని భారత ఫుట్‌బాలర్ సీకే వినీత్‌ను ఉద్యోగం నుంచి తొలిగించారు. 2012లో స్పోర్ట్స్ కోటా కింద కేరళ అకౌంట్ జనరల్ ఆఫీస్‌లో వినీత్‌కు ఉద్యోగం ఇచ్చారు. కానీ బిజీ షెడ్యూల్, ట్రెయినింగ్ కారణంగా అతను కార్యాలయానికి సరిగా వెళ్లడం లేదు. దీంతో కొన్ని రోజులు చూసిన ఏజీ ఆఫీస్ అధికారులు చెప్పపెట్టకుండా వినీత్‌ను ఉద్యోగం నుంచి తొలిగించారు. ఈ విషయాన్ని మీడియా హైలెట్ చేయడంతో కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయెల్ రంగంలోకి దిగారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఏజీ ఆఫీస్ నుంచి నివేదికను తెప్పిస్తున్నామని, ఈ విషయంలో ఫుట్‌బాలర్‌కు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు బెంగళూరు ఎఫ్‌సీ మ్యాచ్‌లు, శిక్షణ కార్యక్రమాల వల్ల తాను కార్యాలయానికి హాజరుకాలేదని వినీత్ తెలిపాడు. ఇంతకుముందు తన ప్రొబేషన్ పీరియడ్‌ను పొడిగించారని, దాన్ని పూర్తి చేయలేకపోయానన్నాడు.

223

More News

VIRAL NEWS