భారత ఆర్చర్లకు నిరాశ


Sat,May 11, 2019 05:03 AM

Archery
షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత ఆర్చర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఒక్క పతకం సాధించకుండానే రిక్తహస్తాలతో స్వదేశానికి బయల్దేరారు. శుక్రవారం జరిగిన రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంటులో బరిలోకి దిగిన భారత ద్వయం జగదీశ్ చౌదరీ, ప్రీతి 2-6 తేడాతో అమెరికా జోడీ బ్రాడీ ఎలిసన్, ఎరిన్ మికిల్‌బెర్రీ చేతిలో ఓటమిపాలైంది. తర్వాత జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంటులో ప్రవీణ్ కుమార్, పర్వీనా 151-155 తేడాతో మలేషియా ద్వయం చేతిలో ఓటమిపాలైంది. అధ్యక్ష పదవికి మళ్లీ ఎన్నికలతో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న భారత ఆర్చరీ సమాఖ్య(ఏఏఐ) ప్రపంచకప్ స్టేజ్-2 టోర్నీకి ద్వితీయ శ్రేణి జట్టును పంపించింది. దీనికి తోడు కాంపౌండ్ విభాగంలో కోచ్ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగింది.

265

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles