పాక్‌పై భారత్ విజయం


Sat,January 13, 2018 02:50 AM

దుబాయ్: అంధుల క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్‌మన్ జమీల్ (90) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 283 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దీపక్ మాలిక్ (79), వెంకటేశ్వర్‌రావు (64) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకుపోయింది. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా... రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచింది. భారత్ నేడు బంగ్లాదేశ్‌తో, రేపు నేపాల్‌తో తలపడనుంది.

184
Tags

More News

VIRAL NEWS