భారత్‌ క్లీన్‌స్వీప్‌


Fri,November 22, 2019 12:50 AM

india-women
విండీస్‌పై 5-0తో సిరీస్‌ కైవసం
గయానా: వెస్టిండీస్‌ పర్యటనలో వరుస విజయాలతో జోరుమీదున్న భారత మహిళల జట్టు చివరి టీ20లోనూ నెగ్గి సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓడిన అనంతరం చివరి రెండు మ్యాచ్‌లు నెగ్గి 2-1తో సిరీస్‌ చేజిక్కించుకున్న భారత్‌.. వరుసగా ఏడు మ్యాచ్‌లు నెగ్గడం విశేషం. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఐదో టీ20లో టీమ్‌ఇండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. జెమీమా రోడ్రిగ్స్‌ (50), వేదా కృష్ణమూర్తి (57 నాటౌట్‌) అర్ధశతకాలతో మెరవడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 134 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్‌ ప్లేయర్లు ఏ మాత్రం పోరాటం కనబర్చకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 73 పరుగులకే పరిమితమైంది. కిషోనా (22), షిమైన్‌ క్యాం ప్‌బెల్‌ (19) మినహా మిగిలిన వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

264

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles