ప్రాక్టీస్ షురూ..


Wed,December 4, 2019 02:16 AM

-ఉప్పల్‌లో చెమటోడ్చిన వెస్టిండీస్..
-రేపటి నుంచి భారత్ కసరత్తులు

westinides
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట వూపతినిధి: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగునున్న తొలి మ్యాచ్ కోసం భారత్, వెస్టిండీస్ జట్లు నగరానికి చేరకున్నాయి. వచ్చి రావడంతోనే ప్రాక్టీస్ మొదపూట్టిన కరీబియన్లు మంగళవారం దాదాపు మూడు గంటలపాటు ఉప్పల్‌లో చెమటోడ్చారు. బుధ, గురువారాలు కూడా ఇరు జట్లు ఇక్కడ ప్రాక్టీస్ చేయనున్నాయని హెచ్‌సీఏ అధికారులు తెలిపారు. ఉదయం పూట ప్రపంచ చాంపియన్ విండీస్ ప్రాక్టీస్ చేస్తే.. మధ్యాహ్నం సమయంలో టీమ్‌ఇండియా ప్రాక్టీస్ చేయనుంది. తొలి మ్యాచ్ అనంతరం డిసెంబర్ 8న తిరువనంతపురంలో రెండో టీ20.. డిసెంబర్ 11న ముంబైలో చివరి మ్యాచ్ జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం సిరీస్ ముంబై మ్యాచ్‌తో ప్రారంభం కావాల్సి ఉన్నా.. భద్రతా ఇబ్బందుల దృష్టా వేదికల్లో స్వల్ప మార్పులు చేసి చివరి మ్యాచ్‌ను వాంఖెడేకు కేటాయించిన విషయం తెలిసిందే. పొట్టి సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య చ్నై (డిసెంబర్ 15), విశాఖపట్నం (డిసెంబర్ 18), కటక్ (డిసెంబర్ 22) వేదికగా మూడు వన్డేలు జరుగనున్నాయి.

అండర్ డాగ్స్‌గా బరిలో దిగుతున్నాం: పొలార్డ్

టీమ్‌ఇండియాతో సిరీస్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా బరిలో దిగుతున్నామని విండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ పేర్కొన్నాడు. ‘బలమైన ప్రత్యర్థితో తలపడనున్నాం. అండర్ డాగ్స్ ముద్ర మంచిదే. మా సత్తా మేరకు ప్రయత్నిస్తే ఎలాంటి ఫలితాలైనా రావొచ్చు’అని పొలార్డ్ అన్నాడు.

415

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles