ధనాధన్‌కు సై..


Thu,March 22, 2018 01:32 AM

భారత్, ఆస్ట్రేలియా మహిళల టీ20 మ్యాచ్ నేడు
womenT20
ముంబై: ధనాధన్ పోరు కు రంగం సిద్ధమైంది. బంతి బంతికి ఉత్కంఠ రేపే పొట్టి ఫార్మాట్‌లో తలపడేందుకు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పక్కా ప్రణాళికతో సమాయత్తమయ్యాయి. గురువారం నుంచి ముక్కోణపు టీ20 సిరీస్ మొదలవుతున్నది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది. వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ పరాజయాన్ని టీ20ల్లో కంగారూలపై కసిగా ప్రతీకారం తీర్చుకునేందుకు హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్సీలోని టీమ్‌ఇండియా కసరత్తు చేస్తున్నది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టీ20 సిరీస్ విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంలో ఉన్న భారత్..అదే జోరులో ఆసీస్, ఇంగ్లండ్‌ను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నది. ఈ నేపథ్యంలో మూడు జట్ల మధ్య మంచి రసవత్తర పోరు జరుగనుంది. స్మృతి మందన, జెమీమా రోడ్రిగెజ్, మిథాలీరాజ్ మంచి ఫామ్‌మీద ఉండట భారత్‌కు బాగా కలిసిరానుంది. గాయపడ్డ ఏక్తా బిస్త్‌కు బదులుగా రాజేశ్వరీ గైక్వాడ్‌ను జట్టుకు ఎంపిక చేశారు. మరోవైపు వన్డే సిరీస్ విజయమిచ్చిన ఊపును కొనసాగించాలన్న తాపత్రయంలో ఆసీస్ ఉన్నది.

471

More News

VIRAL NEWS