ఆధిపత్యం కొనసాగేనా?


Tue,February 13, 2018 02:08 AM

-దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ నేడు
-కౌర్ నాయకత్వంలో టీమ్‌ఇండియా

india
పోట్చెఫ్రాస్ట్రూమ్: ఓవైపు వన్డే సిరీస్ గెలిచిన ఆనందంలో భారత మహిళల జట్టు.. మరోవైపు ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆరాటంలో దక్షిణాఫ్రికా మహిళలు.. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య పొట్టి ఫార్మాట్‌కు రంగం సిద్ధమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం తొలి మ్యాచ్ జరుగనుంది. తొలి రెండు వన్డేల్లో తిరుగులేని ఆధిపత్యం చూపెట్టిన టీమ్‌ఇండియా.. ఆఖరి వన్డేలో కాస్త చతికిలపడింది. అయితే ఇప్పుడున్న ఫామ్ పరంగా చూస్తే టీ20లో భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. కొత్తగా సారథ్య బాధ్యతలు స్వీకరించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. విజయంతో సిరీస్‌ను శుభారంభం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఓపెనర్ స్మృతి మందన ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఇక టీ20 స్పెషలిస్ట్ అనుజ పాటిల్, ఆల్‌రౌండర్ రాధా పాటిల్, వికెట్ కీపర్ నుజ్హత్ పర్వీన్ రాకతో టీమ్‌ఇండియా బ్యాటింగ్ బలం రెట్టింపైంది.

అండర్-19 మ్యాచ్‌లో 163 బంతుల్లో 202 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ముంబై మెరుపుల రాణి 17 ఏండ్ల జెమీమ్ రొడ్రిగ్వేస్ అరంగేట్రానికి సిద్ధమైంది. మిథాలీ, మందనతో పాటు దీప్తి, వేద బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. మూడో వన్డేకు విశ్రాంతి తీసుకున్న పేసర్ జులన్ గోస్వామి ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉన్నది. మరోవైపు వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న సఫారీ జట్టు టీ20ల్లో మాత్రం ఆధిపత్యం చూపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. డు ప్రీజ్, వోల్‌వార్డ్, లెఫ్టార్మ్ పేసర్ శాబ్నిమ్ ఇస్మాయిల్ ఫామ్‌లో ఉండటం వాళ్లకు కలిసొచ్చే అంశం.

286

More News

VIRAL NEWS

Featured Articles