2023 హాకీ ప్రపంచకప్ భారత్‌లో


Sat,November 9, 2019 12:00 AM

hockey-world-cup
లుసానే: పురుషుల హాకీ ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను భారత్ వరుసగా రెండోసారి దక్కించుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తికానున్న.. 2023లో ఈ మెగాటోర్నీ జరుగనుండటంతో ఆతిథ్య హక్కుల కోసం బిడ్ వేసిన హాకీ ఇండియా (హెచ్‌ఐ) మొత్తానికి పంతం నెగ్గించుకుంది. బెల్జియం, మలేషియాతో పోటీపడి అవకాశం దక్కించుకున్న భారత్.. 2023 జనవరి 13 నుంచి 29 మధ్య మెగాటోర్నీని నిర్వహించనుంది. దీంతో పాటు అత్యధిక సార్లు ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్న దేశంగా రికార్డుల్లోకి ఎక్కింది. గతంలో 1982 (ముంబై), 2010 (న్యూఢిల్లీ), 2018 (భువనేశ్వర్) మూడు సార్లు మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన భారత్ ఇప్పుడు నాలుగోసారి ఆ హక్కులు చేజిక్కించుకొని నెదర్లాండ్స్ (3 సార్లు)ను వెనక్కి నెట్టింది. 2022లో జరుగునున్న మహిళల ప్రపంచకప్‌ను స్పెయిన్, నెదర్లాండ్స్ ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఎఫ్‌ఐహెచ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

155

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles