ప్రపంచ కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడొద్దు


Tue,February 19, 2019 01:51 AM

HarbhajanSingh1
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడొద్దని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ అన్నాడు. జూన్ 16న మాంచెస్టర్‌లో పాక్‌తో మ్యాచ్‌ను వదిలేసుకున్నా.. వరల్డ్‌కప్ గెలిచే సత్తా టీమ్‌ఇండియాకు ఉందని స్పష్టం చేశాడు. ఇది చాలా క్లిష్టమైన సమయం. ఉగ్రదాడిని నమ్మలేకపోతున్నా. పాక్ చాలా తప్పులు చేస్తున్నది. ప్రభుత్వం కఠినమైన చర్యలకు దిగాల్సిందే. క్రికెట్ విషయానికొస్తే వాళ్లతో మ్యాచ్‌లే ఆడొద్దు. లేదంటే ఇలాంటి చేష్టలకు పాల్పడుతూనే ఉంటుంది. ఓసారి గట్టిగా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి అని భజ్జీ పేర్కొన్నాడు. సైన్యానికి మద్దతుగా పాక్‌తో ఎలాంటి ఆటలను పునరుద్ధరించొద్దని విజ్ఞప్తి చేశాడు. దేశ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే మిగతావి. ఇలాంటి సంఘటనలకు పాల్పడుతుంటే వరల్డ్‌కప్‌లో వాళ్లతో మ్యాచ్ ఆడి ఏంలాభం. క్రికెట్, హాకీ, ఇతర క్రీడలన్నింటినీ నిషేధించాల్సిందే. పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు. దేశం కంటే క్రికెట్ ముఖ్యం కానేకాదు. సైనికుల త్యాగాలు వృథాకావొద్దు. ప్రపంచ స్థాయికి ఎదిగే శక్తి మన దగ్గర ఉంది అని హర్భజన్ వ్యాఖ్యానించాడు

982
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles