అమ్మాయిలు అదరగొట్టారు..


Mon,February 11, 2019 01:56 AM

గోరఖ్‌పూర్: ఫ్రాన్స్ ఎతో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత్ ఎ జట్టు 3-2తో అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థి ఫ్రాన్స్ చేతిలో ఎదురైన ఓటమికి మలి మ్యాచ్‌లో అమ్మాయిలు ప్రతీకారం తీర్చుకున్నారు. టీమ్‌ఇండియా తరఫున మరియాన కుజుర్(19ని), లాల్‌రెమిసియామి(30ని), ముంతాజ్‌ఖాన్(34ని) గోల్స్ చేశారు. మరోవైపు ఫ్రాన్స్ ఎ తరఫున మికిలియా లాల్హ్(14ని), గుసెవాన్ బోల్హాస్(58ని) గోల్స్ అందించారు. మికిలియా గోల్‌తో ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఐదు నిమిషాల తేడాతో కుజుర్ గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. అదే జోరును కొనసాగిస్తూ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌తో భారత్ 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది.

365

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles