మెయిన్ డ్రాకు ప్రజ్నేశ్ ఆస్ట్రేలియన్ ఓపెన్


Sat,January 12, 2019 02:32 AM

prajnesh

మెల్‌బోర్న్: భారత వర్ధమాన ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్‌డ్రాకు అర్హత సాధించాడు. తద్వారా ఐదేండ్ల కాలంలో గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన మూడో భారతీయుడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు పురుషుల సింగిల్స్‌లో యుకీ బాంబ్రి, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మాత్రమే గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాలో చోటు సంపాదించుకున్నారు.శుక్రవారం జపాన్ ఆటగాడు యోసికె వటానుకితో జరిగిన చివరి అర్హత మ్యాచ్‌లో 6-7(5), 6-4,6-4 స్కోరుతో గుణేశ్వరన్ విజయం సాధించాడు. 29 ఏండ్ల ప్రజ్నేశ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ కావడం గమనార్హం.గ్రాండ్‌స్లామ్ ఆడాలన్నది నా కల. ఆస్టేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడంతో నా కల నిజమైంది. ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు మాటలు రావడం లేదు అని మ్యాచ్ ముగిసిన అనంతరం గుణేశ్వరన్ ఉద్వేగంగా పలికాడు. తొలిసెట్ ఓడిపోవడంతో కాస్త ఒత్తిడికి గురైనా.. కోర్టులో పోరాడానని చెప్పాడు. దీంతో చివరి రెండు సెట్లను గెలుచుకున్నట్లు వివరించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలిరౌండ్‌లో అమెరికా టెన్నిస్ ఆటగాడు ఫ్రాన్సెస్ తియాఫోతో తలపడనున్నాడు.

163

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles