నాన్న త్యాగాల వల్లే..


Wed,December 4, 2019 02:40 AM

పదకొండేండ్లకే తల్లిని కోల్పోయిన పసివూపాయం..క్రికెట్ కిట్ కోసం తండ్రి అప్పుచేయాల్సిన పేదరికం.కోచింగ్‌కు వెళ్లాలంటే పాల వ్యాపారాన్ని వదులు కోవాల్సిన దీనస్థితి..ఇన్ని ప్రతికూలతలలోనూ ఓ కుర్రాడు.. తండ్రి త్యాగాలను వృథా కానివ్వొద్దని బలంగా సంకల్పించాడు. ఐదుగురు సంతానం ఉన్న కుటుంబంలో ఒకరు తింటే మరొకరు పస్తులుండాల్సిన పరిస్థితి. ఇది మారాలంటే గొప్పగా ఏదైనా చేయాలని చిన్నప్పుడే అనుకున్న ఆ కుర్రాడు.. అంచెలంచెలుగా ఎదుగుతూ అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొనే యువ భారత జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే పరమావధి అంటున్న 19 ఏండ్ల ప్రియం గార్గ్ అందుకు ప్రపంచ కప్ సరైన వేదికగా భావిస్తున్నాడు. ఇప్పటికే జూనియర్ స్థాయిలో జట్టును ముందుకు నడిపించి.. టీమ్‌ఇండియాకు ఎంపికైన మహమ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ, పృథ్వీ షా అడుగుజాడల్లో నడుస్తూ తన కల సాకారం చేసుకోవాలనుకుంటున్ని ప్రియం ప్రస్థానంపై ఓ లుక్కేస్తే..!
priyam-garg
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: ప్రియం గార్గ్.. రెండు రోజులుగా భారత క్రికెట్‌లో విపరీతంగా వినిపిస్తున్న పేరు. వచ్చే నెలలో దక్షిణావూఫికా వేదికగా జరుగనున్న అండర్-19 ప్రపంచకప్‌లో బారత జట్టుకు నాయకత్వం వహించనుంది ఈ ఉత్తరవూపదేశ్ కుర్రాడే. మీరట్‌కు పాతిక కిలోమీటర్ల దూరంలోని ఖిలా పరీక్షిత్‌గఢ్‌కు చెందిన ప్రియం ఆరేండ్ల వయసులోనే బ్యాట్‌పట్టాడు. అయితే అందరు పిల్లల్లా అతడి బాల్యంలో మధురస్మక్షుతులు పెద్దగా లేవు. పదకొండేండ్ల వయసులోనే తల్లిని కోల్పోయిన ప్రియం.. తండ్రి ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరాడు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి కనీసం క్రికెట్ కిట్ కొనడానికి కూడా డబ్బులు లేని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన గార్గ్ ప్రస్థానం ప్రతి ఒక్కరికి స్పూర్తిపాఠం. ఈ స్థాయికి చేరడం వెనుక తన తండ్రి పడ్డ కష్టాలు అనేకమని.. ఆయన త్యాగాల వల్లే తాను అండర్-19 జట్టుకు కెప్టెన్ కాగలిగానని గార్గ్ అంటున్నాడు.

అప్పుచేసి క్రికెట్ కిట్ కొనిచ్చి..

పాల వ్యాపారం చేసుకునే నరేశ్ గార్గ్ ఐదుగురు సంతానంలో చివరివాడే ప్రియం. ఓ సోదరుడు, ముగ్గురు అక్కలతో కూడిన పెద్ద కుటుంబం. తండ్రి వ్యాపారంతో ఇళ్లు గడవడమే కష్టం. అలాంటిది ఇంకా క్రికెట్ కోచింగ్ అంటే ఆ కుటుంబానికి అదనపు బరువే. అయినా పసివూపాయంలోనే అసాధారణ ప్రతిభ కనబర్చిన గార్గ్ కృషి వృథాకానివ్వొద్దనుకున్న తండ్రి నరేశ్.. స్నేహితుల వద్ద అప్పు చేసి క్రికెట్ కిట్ కొనిచ్చాడు. అయితే ప్రియం 11 ఏండ్ల వయసులో అనారోగ్యంతో తల్లి చనిపోయింది. దీంతో ఆటపై దృష్టి పెట్టలేకపోయిన గార్గ్‌కు తండ్రి దిశానిర్దేశం చేశాడు. ఇక్కడితో ఆగిపోతే.. పడ్డ కష్టమంతా వృథా అవుతుంది. ఏదో ఒకరోజు నువ్వు దేశానికి ప్రాతినిధ్యం వహించాలి అని కార్యోణ్ముఖుడిని చేసి మీరట్‌లోని కోచింగ్ అకాడమీలో చేర్చాడు.

భువీ అడుగుజాడల్లో..

ఆ అకాడమీ నుంచే వచ్చిన భువనేశ్వర్ కుమార్ టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో సహజంగానే గార్గ్‌లో జిజ్ఞాస పెరిగిపోయింది. నిలకడగా రాణిస్తే.. ఏదో ఒక రోజు బ్లూ జెర్సీ వేసుకోవడం ఖాయమే అన్న ఆలోచన అతడిలో పుట్టింది. దీంతో ప్రతి రోజు 7-8 గంటలు ప్రాక్టీస్‌కు కేటాయిస్తూ.. మిగిలిన సమయంలో చదువుకుంటూ ముందుకు సాగాడు. ప్రతిరోజూ తెల్లవారుజామునే కొడుకును మీరట్ తీసుకెళ్లాల్సి రావడంతో తండ్రి తన పాల వ్యాపారాన్ని వదిలేశాడు. స్కూల్ బస్ డ్రైవర్‌గా కొత్త కొలువు వెతుక్కున్నాడు. ఆ వచ్చిన డబ్బులతో ఇళ్లు గడవడం కష్టమవడంతో న్యూస్ పేపర్ వేయడం, సరుకులు మోయడం ఇలా అనేక చిన్న చిన్న పనులు చేశాడు. అకాడమీలో సంజయ్ రస్తోగి కోచింగ్‌లో రాటుదేలిన ప్రియం అనతి కాలంలోనే అండర్-14 జట్టుకు ఎంపికయ్యాడు. ఇక అక్కడి నుంచి అండర్-16,-19, రంజీ ఇలా ఒక్కో మెట్టు ఎక్కాడు.

సచిన్‌ను చూసేందుకు..

కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంట్లో టీవీ లేకపోవడంతో టీమ్‌ఇండియా మ్యాచ్ ప్రసారమవుతుందంటే చాలు టీవీ షోరూమ్‌ల ముందు వాలిపోయేవాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను రోల్ మోడల్‌గా భావించే గార్గ్.. భవిష్యత్తులో ఎప్పటికైనా తన కల సాకారం చేసుకుంటానంటున్నాడు. ‘సచిన్ టెండూల్కర్‌ను కలవడం నా కల. ఆయన నుంచి టిప్స్ తీసుకోవాలనుకుంటున్నా. ఏదో ఒక రోజు మాస్టర్‌లా బ్లూ జెర్సీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తా’అని ప్రియం నమ్మకంగా అంటున్నాడు. తల్లి బతికుండగా.. ‘నేను దేశానికి ఆడుతాను. నువ్వు కన్న కలలను సాకారం చేస్తాను’అని ఎన్నో మాటలు చెప్పిన ఆ బుడతడు ఇప్పుడు అండర్-19 లెవల్‌లో దేశానికి సారధ్యం వహిస్తుంటే.. ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించేందుకు తల్లి లేకపోవడం విశాదకరం. ‘2011లో మా అమ్మ చనిపోయింది. ఆమె కన్న కలల్లో అతి పెద్దది నేను దేశానికి ప్రాతినిధ్యం వహించడం. ఒకదశలో ఆటలు అంటూ తిరిగితే పాడైపోతానని.. బాగా చదువకుంటే ఉద్యోగం చేసుకోవచ్చని మా అమ్మ అనుకుంది. కానీ నా పట్టుదల చూశాక ప్రోత్సహించింది. ఇప్పుడు నేను యువభారత్‌కు ఎంపికయ్యా. కానీ ఈ ఆనందాన్ని పంచుకునేందుకు ఆమె మా మధ్యలేదు’అని గార్గ్ కంటతడి పెట్టాడు.

ప్రియంను మైదానానికి తీసుకెళ్లేందుకు పాల వ్యాపారాన్ని ఆపేశా. అప్పటి నుంచి స్కూల్ బస్ నడుపుతూ.. న్యూస్ పేపర్లు అమ్మేవాడిని. ప్రియం అండర్-19కు ఆడుతున్నప్పుడు ఒకసారి రాహుల్ ద్రవిడ్ పిలిచి మీ అబ్బాయి గురించి భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. ఆ రోజు నా అనందానికి అవధులు లేవు.
Naresh-Garg
- నరేశ్ గార్గ్, ప్రియం తండ్రి

ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ

పువ్వు పుట్టగానే పరిమిలిస్తుందనే చందంగా.. రంజీ ట్రోఫీలో బరిలో దిగిన తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటిన ప్రియం.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డబుల్ సెంచరీని తన పేరిట రాసుకున్నాడు. 2018-19 రంజీ సీజన్‌లో ఉత్తరవూపదేశ్ తరఫున 800పైగా పరుగులు చేసిన ప్రియం మృధుస్వభావి. సహచరుల నుంచి తనకు కావాల్సింది రాబట్టుకునేందుకు ప్రయత్నించడంలోనూ సౌమ్యుడే కావడం అతడిని సారథిగా ఎంపిక చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. మా నాన్న నా కోసం పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు చూస్తూ ఎదిగిన నేను ఆటలో ఉన్నత శిఖరాలకు చేరి ఆయన రుణం తీర్చుకుంటా అని ఆత్మవిశ్వాసంతో అంటున్నాడు.

1260

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles