క్వార్టర్స్‌లో భారత్


Mon,July 22, 2019 02:38 AM

న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం పాలైనా.. క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. చైనా వేదికగా జరుగుతున్న టోర్నీలో ఆదివారం భారత్ 1-4తో కొరియా చేతిలో ఓడింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట నెగ్గిన భారత్ 4 పాయింట్లతో గ్రూప్ సిలో రెండో స్థానంతో క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. సోమవారం జరుగనున్న నాకౌట్‌లో ఇండోనేషియాతో భారత్ తలపడనుంది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భాగంగా మొదట జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో డింకూ సింగ్-రితిక ఠక్కర్ జోడీ 21-19, 12-21, 12-21తో డాంగ్ జూ-యున్‌జీ ద్వయం చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో మైరబా లువాంగ్ 21-19, 19-21, 21-18తో సెంగ్ పార్క్‌పై గెలిచి స్కోరును 1-1తో సమం చేసినా.. ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లు ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో విష్ణు వర్ధన్ గౌడ్-ఇషాన్ జోడీ.. మహిళల డబుల్స్‌లో తనీష-త్రిష జంట.. మహిళల సింగిల్స్‌లో మాలవిక నిరాశజనక ప్రదర్శన చేశారు.

197
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles