ఆసీస్ చేతిలో భారత్ ఓటమి


Thu,May 16, 2019 03:56 AM

hockey
పెర్త్: భారత హాకీ జట్టుకు చుక్కెదురైంది. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 0-4 తేడాతో ఓటమి పాలైంది. ఆసీస్ తరఫున బ్లేక్ గోవర్స్(15ని, 60ని), జెరెమీ హేవర్డ్(20ని, 59ని) డబుల్ గోల్స్‌తో కంగారూల విజయంలో కీలకమయ్యారు. మ్యాచ్‌లో తొలుత భారత్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ ఆసీస్ ఒక్కసారిగా పుంజుకుని పోటీలోకి వచ్చింది. మ్యాచ్ ఐదో నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను భారత్ వృథా చేసుకుంది. మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా గోవర్స్ పెనాల్టీ కార్నర్ గోల్‌తో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. టీమ్‌ఇండియా గోల్‌పోస్ట్‌పై వరుస దాడులకు పాల్పడ్డ ఆసీస్ ఆఖరి రెండు నిమిషాల్లో గోల్స్ చేసి మ్యాచ్‌ను భారీ విజయంతో ముగించింది.

342

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles