చేజింగ్‌లో మనమే టాప్


Fri,November 8, 2019 11:52 PM

రాజ్‌కోట్: అంతర్జాతీయ టీ20ల్లో భారత్ అరుదైన రికార్డు అందుకుంది. ఇప్పటి వరకు 61 మ్యాచ్‌ల్లో 41 సార్లు లక్ష్యాన్ని ఛేదించి టాప్‌లో నిలిచింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో గెలువడం ద్వారా టీమ్‌ఇండియా ఈ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. దీంతో ఆస్ట్రేలియా(69 మ్యాచ్‌ల్లో 40) పేరిట ఉన్న అత్యధిక విజయాల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. పొట్టి పార్మాట్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్న దాయాది పాకిస్థాన్ 67 మ్యాచ్‌ల్లో 36 మ్యాచ్‌ల్లో లక్ష్యాన్ని ఛేదించి భారత్, ఆస్ట్రేలియా తర్వాత మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ 28 విజయాలతో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాయి. భారత్ విజయాల్లో కెప్టెన్ కోహ్లీకి తోడు హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ, ధోనీ కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. ముఖ్యంగా టీ20 లక్ష్యఛేదనలో కోహ్లీ 25 మ్యాచ్‌ల్లో 1115 పరుగులు చేయగా, రోహిత్ 30.32 సగటుతో 849 పరుగులు సాధించాడు. మరోవైపు సీనియర్ ధోనీ 29 మ్యాచ్‌ల్లో 72.50 సగటు కనబరిచాడు. సిరీస్‌లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన గురువారం నాటి రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే.

433

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles