దీప్తి, పూనమ్ విజృంభణ


Sat,May 20, 2017 12:50 AM

-జింబాబ్వేపై భారత్ ఘనవిజయం

deepthi
పొచెఫ్‌స్ట్రూమ్: నాలుగు దేశాల క్రికెట్ టోర్నీలో భారత్ వరుస విజయాలతో అదరగొడుతున్నది. దక్షిణాఫ్రికాపై ఏకైక ఓటమి మినహాయిస్తే..టీమ్‌ఇండియాకు అసలు ఎదురన్నదే లేదు. ఇప్పటికే టోర్నీలో ఫైనల్‌కు చేరిన మిథాలీసేన శుక్రవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 99 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్ వేదా కృష్ణమూర్తి(50) అజేయ అర్ధసెంచరీతో రాణించగా, హర్మన్‌ప్రీత్‌కౌర్(39) నాటౌట్‌గా నిలిచింది. తొలుత దీప్తిశర్మ(4/17), పూనమ్ యాదవ్(4/11) విజృంభణతో జింబాబ్వే 42.3 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. వీరిద్దరి బౌలింగ్ ధాటికి ఓపెనర్ ముగేరి(34) మినహా ఎవరూ రాణించలేకపోయారు. మిగతా వారంతా స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేరుకున్నారు. జులన్ గోస్వామి(1/21), శిఖాపాండే(1/29) ఒక్కో వికెట్ తీశారు. నాలుగు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించిన దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది.

285

More News

VIRAL NEWS