కామన్‌వెల్త్ టీటీలో ఆరంభం అదుర్స్


Thu,July 18, 2019 03:34 AM

Manika-Batra
కటక్: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య భారత్ ప్లేయర్లు తొలిరోజు అదరగొట్టారు. పురుషుల, మహిళల జట్లు బుధవారం జరిగిన గ్రూప్‌దశలో అగ్రస్థానాన నిలిచి సూపర్-8కు అర్హత సాధించాయి. పురుషు జట్టులో శరత్‌కమల్, జి.సాహిత్యన్, హర్మీత్ దేశాయ్ అద్భుతంగా రాణించి స్కాట్‌లాండ్‌ను 3-0తో ఓడించారు. అదే దూకుడుతో సింగపూర్‌ను కూడా 3-0తో మట్టికరిపించి గ్రూప్-బిలో టాప్‌లో నిలిచారు. మహిళల విభాగంలో మనికా బాత్రా, ఐహికా ముఖర్జీ, అర్చనా కమల్‌నాథ్.. శ్రీలంక జట్టును 3-0తేడాతో క్లీన్‌స్వీప్ చేశారు. ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ మధురికా పాట్కర్, సుతిర్త ముఖర్జీ, అర్చనతో కూడిన మహిళా జట్టు 3-0తో మహిళా జట్టు విజయం సాధించి గ్రూప్-బీలో టాప్‌లోకి వెళ్లింది. మొత్తంగా భారత్ రెండు గేమ్‌లలో మాత్రమే పరాజయం చెంది, మిగిలిన వాటిలో ఘన విజయం సాధించి ముందడుగేసింది. మహిళల విభాగంలో గ్రూప్-ఏ, సీ,డీలో వరుసగా సింగపూర్, ఆస్ట్రేలియా, నైజీరియా అగ్రస్థానాన నిలిచాయి.

278

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles