సెమీస్‌లో భారత్


Thu,December 7, 2017 03:18 AM

-పెనాల్టీ షూటౌట్‌లో బెల్జియంపై ఉత్కంఠ గెలుపు
-వరల్డ్ హాకీ లీగ్ ఫైనల్ టోర్నీ
indian-hockey
భువనేశ్వర్: నరాలు తెగే ఉత్కంఠ.. ఒకవైపు బలమైన ప్రత్యర్థి..మరోవైపు సొంతగడ్డపై ఎక్కడ అపకీర్తి మూటగట్టుకుంటామో అన్న ఆందోళన...చివరి క్షణం వరకు చేతులు మారిన ఆధిపత్యం...ఒత్తిడిలోనూ అనుభవాన్ని రంగరించి ఒడ్డుకు చేర్చిన వైనం..ఫలితంగా భారత హాకీ జట్టు ప్రపంచ హాకీ లీగ్ ఫైనల్ టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో ఓటమే ఎరుగని బెల్జియంకు.. లీగ్ దశలో గెలుపే లేని భారత్ షాక్ ఇచ్చింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియం ఆటగాళ్ల దూకుడుకు భారత డిఫెండర్లు అడ్డుకట్ట వేస్తూ...కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సహా యువ ఆటగాళ్లు చురుకైన కదలికలతో గోల్స్ చేస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నారు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3-3తో సమంగా నిలిచాయి. భారత్‌కు గుర్జంత్‌సింగ్ (31 ని) మొదటి గోల్ అందించగా, అదే జోష్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (35 ని) మరో గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. అయితే వెంటనే తేరుకున్న బెల్జియంకు లాయిక్ లుయాపరెట్ (39, 46 ని) రెండు గోల్స్ అందించాడు. క్షణం కూడా ఆలస్యం కాకుండా భారత్ రూపిందర్‌పాల్ (46 ని) రూపంలో మూడో గోల్ సాధించి మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో బెల్జియంను గోల్ చే యకుండా భారత్ అడ్డు కుంది. అయితే అమౌరీ క్యూస్టర్స్ (53 ని) బెల్జియంకు గోల్ అందించడంతో మ్యాచ్ 3-3తో సమమైంది. ఆ తర్వాత ఇరుజట్లు మరో గోల్ సాధించలేకపోవడంతో షూటౌట్‌కు దారితీసింది.

290

More News

VIRAL NEWS

Featured Articles