ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం


Sun,August 25, 2019 01:44 AM

Archery
మాడ్రిడ్: ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. శనివారం జరిగిన కాంపౌండ్ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంటు ఫైనల్లో భారత ద్వయం సుఖ్‌బీర్‌సింగ్, రాగిణి మార్కు 152-147 తేడాతో అండ్రియా వాల్రో, జానైన్ హన్స్‌పెర్గర్ జోడీపై విజయం సాధించింది. ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ గురితప్పని కచ్చితమైన షాట్లతో లక్ష్యాన్ని ఛేదిస్తూ కీలక పాయింట్లు కొల్లగొట్టారు. ఆదివారం జరిగే రికర్వ్ క్యాడెట్ ఫైనల్లో భారత ఆర్చర్ కోమలిక బారీ..సోనోడ వాక(జపాన్)తో తలపడుతుంది.

487

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles