సంచలనాలు లేకుండానే..


Fri,November 22, 2019 01:04 AM

bhuvi
వెస్టిండీస్‌తో సిరీస్‌లకు భారత జట్ల ప్రకటన
కోల్‌కతా: వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ గురువారం జట్లను ప్రకటించింది. ఎలాంటి సంచలనాలకు తావులేకుండా చిన్న చిన్న మార్పులతో 15 మందితో కూడిన రెండు జట్లను ఎంపిక చేసింది. ఇటీవల టీ20 అరంగేట్రం చేసిన శివం దూబే వన్డే జట్టులోనూ చోటు దక్కించుకోగా.. పేసర్‌ మహమ్మద్‌ షమీ రెండేండ్ల తర్వాత టీ20 టీమ్‌లోకి వచ్చాడు. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న భువనేశ్వర్‌ కుమార్‌ రెండు సిరీస్‌లకు ఎంపిక కాగా.. బంగ్లాతో టీ20 సిరీస్‌కు విరామం తీసుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి పగ్గాలందుకున్నాడు. బంగ్లాతో సిరీస్‌కు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎంపికైన సంజూ శాంసన్‌కు మ్యాచ్‌ అవకాశం రాకుండానే ఉద్వాసన పలకడం ఒక్కటే కాస్త బాధకరం. విరామం లేకుండా శ్రమిస్తున్న రోహిత్‌ శర్మకు విశ్రాంతినిస్తారని అంతా ఊహిస్తే.. అలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదు.

పొట్టి ఫార్మాట్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా స్థానంలో కుల్దీప్‌ను ఎంపిక చేయగా.. ఖలీల్‌ ప్లేస్‌ను షమీ భర్తీచేశాడు. డిసెంబర్‌ 6న ముంబైలో జరిగే తొలి టీ20లో పొట్టి సిరీస్‌ ప్రారంభం కానుండగా.. డిసెంబర్‌ 22న కటక్‌లో జరిగే మూడో మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ ముగియనుంది.వన్డే జట్టు: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌, రాహుల్‌, పంత్‌, మనీశ్‌, కేదార్‌, శ్రేయాస్‌, జడేజా, శివం, చహల్‌, కుల్దీప్‌, షమీ, దీపక్‌, భువనేశ్వర్‌.

టీ20 జట్టు: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌, రాహుల్‌, పంత్‌, మనీశ్‌, శ్రేయాస్‌, జడేజా, శివం, చహల్‌, కుల్దీప్‌, షమీ, దీపక్‌, భువనేశ్వర్‌, సుందర్‌.

424

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles