అదో యుద్ధంలాంటిది!


Sat,April 13, 2019 02:12 AM

- ఇండో-పాక్ మ్యాచ్‌పై సెహ్వాగ్ వ్యాఖ్య
sehwag
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్.. యుద్ధం కంటే ఏమాత్రం తక్కువ కాదని డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. పాక్‌తో మ్యాచ్ ఆడాలా? వద్దా? అన్న దానిపై వీరూ భిన్నంగా స్పందించాడు. ప్రస్తుతం రెండు అంశాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. పాకిస్థాన్‌తో యుద్ధం కావాలా? అని ఒకటి.. వద్దా? అని మరొకటి. ఈ రెండింటిలో ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే పాక్‌తో మ్యాచ్ ఆడాలా? వద్దా? అనేది తేలిపోతుంది. ఇందులో రెండో అంశం ఏమిటంటే.. దేశ ప్రయోజనాలకు ఏది ముఖ్యమనుకుంటే అది చేయడం. ఏదేమైనా పాక్‌తో మ్యాచ్ అంటే ఓ యుద్ధంతో సమానం. ఇందులో మనం గెలువాలి... ఓడకూడదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటుంది.

నా వరకైతే ఈసారి కూడా భారతే మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నా అని గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్ ఆడటంపై మాజీలు రెండు వర్గాలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలపై కూడా వీరూ తనదైన శైలిలో స్పందించాడు. తనకు ఏ పార్టీ మంచి కాంట్రాక్ట్ ఇస్తే అందులో చేరుతానన్నాడు. నేనెప్పుడూ ఒప్పందం పద్ధతిపైనే పని చేస్తా. రంజీ నుంచి మొదలుపెడితే ఐపీఎల్ వరకు ఇలాగే చేశా. ఇప్పుడు కూడా ఏ పార్టీ మంచి కాంట్రాక్ట్ ఇస్తే అందులో చేరిపోతా. ఈ ఒప్పందం విలువ వంద కోట్లకు తక్కువగా ఉండొద్దు అని సెహ్వాగ్ చమత్కరించాడు.

248

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles