భారత్-ఎ భారీ ఓటమి


Fri,July 20, 2018 12:13 AM

వర్సెస్టర్: విదేశీ పిచ్‌లపై భారత కుర్రాళ్లు సత్తా చాటలేకపోయారు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన నాలుగు రోజుల అనధికార టెస్టులో భారత్-ఎ జట్టు 254 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. 421 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 11/3 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. రిషబ్ పంత్ (61), రహానే (48) మినహా మిగతా వారు విఫలమయ్యారు. టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న నాయర్ (13), విజయ్ (0) నిరాశపర్చారు. ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి లంచ్ వరకు టీమ్‌ఇండియా 115 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుంది. తర్వాత పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. సహచరుల నుంచి సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో పోర్టర్, కుర్రాన్, బెస్ తలా రెండు వికెట్లు తీశారు.


Ajinkya-Rahane

271

More News

VIRAL NEWS