ఫైనల్లో సాక్షి, బాసుమట్రి


Sat,April 13, 2019 01:58 AM

-పింకి, పర్వీన్‌కు కాంస్యాలు
కోలోగ్ని: కోలోగ్ని బాక్సింగ్ ప్రపంచకప్‌లో భారత బాక్సర్ల పంచ్ అదిరింది. యూత్ వరల్డ్ చాంపియన్ సాక్షి, పిలావో బాసుమట్రి ఫైనల్లోకి దూసుకెళ్లగా, ఇద్దరు కాంస్యాలతో మెరిశారు. శుక్రవారం జరిగిన 57 కేజీల సెమీస్‌లో 18 ఏండ్ల సాక్షి 5-0తో టింటాబాతి ప్రిడాకామోన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. 64 కేజీల బౌట్‌లో బాసుమట్రి.. అయేజా డిటి ఫ్రోస్తోలమ్ (డెన్మార్క్)ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు జరిగిన 51 కేజీల సెమీస్‌లో పింకి రాణి 0-5తో కార్లీ మెక్‌నుల్ (ఐర్లాండ్) చేతిలో, 60 కేజీల బౌట్‌లో పర్వీన్ కూడా 0-5తో పైజ్ ముర్ని (ఇంగ్లండ్) చేతిలో ఓడి కాంస్యాలతో సంతృప్తిపడ్డారు.

164

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles