పైచేయి ఎవరిది?


Wed,June 12, 2019 12:56 AM

Australia

- నేడు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఢీ
టాంటన్ : ప్రపంచకప్‌లో అతిథ్య ఇంగ్లండ్‌ను ఖంగు తినిపించి మంచి ఊపుమీద ఉన్న పాకిస్థాన్... డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా తో బుధవారం తలపడనుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై తడబడ్డా.. ఆ తర్వాత ఇంగ్లిష్ జట్టుపై గెలిచి పాక్ ఆత్మ విశ్వాసంతో ఉంది. శ్రీలంకతో మ్యాచ్ రద్దు కారణంగా పాక్ ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీని ఘనంగా ఆరంభించినా.. భారత్ చేతిలో పరాజయంతో కాస్త నిరాశలో ఉంది. మరి టాంటన్ వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి ఆసీస్ మళ్లీ గెలుపుబాట పడుతుందేమో చూడాలి.

బ్యాటింగే బలం: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ రెండు జట్లకు ప్రధాన బలం బ్యాటింగే. ఆసీస్ బ్యాట్స్‌మెన్ వార్నర్, స్మిత్.. ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో మినహా రెండింటిలోనూ అర్ధశతకా లు చేసి జోరు మీదున్నారు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 92 పరుగులతో గెలుపు లో కౌల్టర్‌నైల్ కీలకపాత్ర పోషించాడు. అయితే, గాయ పడ్డ స్టాయినిస్ స్థానంలో ఈ మ్యాచ్‌కు షాన్ మార్ష్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

వర్షం ముప్పు...

టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షార్ప ణం కాగా... ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడి ప్రమాదం పొంచి ఉంది. ఆకాశం మేఘావృతమై.. వాన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాంటన్ పిచ్, వాతావరణ పరిస్థితులు పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది.

ముఖాముఖి

ఆడిన మ్యాచ్‌లు - 9
ఆస్ట్రేలియా గెలిచినవి - 5
పాకిస్థాన్ గెలిచినవి - 4

411

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles