రేపు బీసీసీఐతో ఐసీసీ వర్కింగ్ గ్రూప్ సమావేశం


Wed,May 16, 2018 12:55 AM

bcci-logo
న్యూఢిల్లీ: టెస్టుక్రికెట్ భవిష్యత్‌తో పాటు ఇతర సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఐసీసీ వర్కింగ్ గ్రూప్.. బీసీసీఐ సీనియర్ అధికారులతో గురువారం ఢిల్లీలో సమావేశంకానుంది. ఐసీసీ కొత్త విధానాలను వెల్లడించడంతో పాటు వీటిపై భాగస్వాముల (సభ్య దేశాలు, స్పాన్సర్స్) నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సేకరించనున్నారు. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదురి, కోశాధికారి అనిరుధ్ చౌదురి, సీఈవో రాహుల్ జోహ్రీ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. టీ20 ప్రజాదరణలో మసకబారిపోతున్న టెస్టు క్రికెట్‌ను కాపాడటం, క్రికెట్ ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయి. సభ్య దేశాల ఫీడ్‌బ్యాక్‌ను సేకరించిన తర్వాత వర్కింగ్ గ్రూప్ ఓ సమగ్ర నివేదికను తయారు చేయనుంది. డేనైట్ టెస్టుపై కూడా ఇందులో చర్చించే అవకాశముంది.

536
Tags

More News

VIRAL NEWS