కోహ్లీ మళ్లీ నంబర్‌వన్


Thu,December 5, 2019 12:36 AM

-ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి
virat
దుబాయ్: టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో తొలి డే అండ్ నైట్ టెస్టులో శతక్కొట్టిన కోహ్లీ గత వారమే 928 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా పాకిస్థాన్‌తో సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పెద్దగా పరుగులు చేయకపోవడంతో ఎనిమిది రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. దీంతో స్మిత్ (923) కంటే ఐదు పాయింట్లు ఎక్కువ ఉన్న కింగ్ కోహ్లీ నంబర్‌వన్ అయ్యాడు. చతేశ్వర్ పుజారా 4వ స్థానంలో కొనసాగుతుండగా.. అజింక్యా రహానే ఓ ర్యాంక్ కోల్పోయి 6వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో బు మ్రా ఐదో స్థానంలో ఉంటే.. అశ్విన్ 9వ ప్లేస్‌లో నిలిచాడు. పాక్‌పై ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడిన డేవిడ్ వార్నర్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 110వ స్థానంతో ఈ ఏడాది ప్రారంభించిన లబుషేన్ (8) టాప్-10లో నిలువడం విశేషం. న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఏడో ర్యాంక్‌కు చేరాడు.

179

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles