ధర్మసేనకు ఐసీసీ దన్ను


Sun,July 28, 2019 01:00 AM

kumara
న్యూఢిల్లీ: ప్రపంచకప్ ఫైనల్ చివరి ఓవర్లో ఓవర్‌త్రోకు ఐదుకు బదులు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు ఇచ్చిన అంపైర్ ధర్మసేనపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఐసీసీ మాత్రం ధర్మసేనను వెనకేసుకొచ్చింది. సరైన ప్రక్రియ ప్రకారమే అంపైర్లు ఆ నిర్ణయం తీసుకున్నారని శుక్రవారం పేర్కొంది. ఫీల్డర్ త్రో విసిరినప్పుడు బ్యాట్స్‌మెన్ క్రీజును దాటారా లేదా అనే విషయంపై ఆ మ్యాచ్ ఫీల్డ్ అం పైర్లే తీర్పునివ్వా లి. ఆ త్రో వేశా క అంపైర్లిద్దరూ చర్చించుకున్నా రు. ఆ తర్వాతే నిర్ణయం వెలువరించారు. నిర్ణ యం తీసుకునేందుకు వారు సరైన ప్రక్రియనే అవలంభించారు. సమీక్ష కోసం థర్డ్ అంపైర్‌ను సంప్రదించేందుకు అప్పటి పరిస్థితులు వారిని అనుమతించలేదు అని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్‌డైస్ అన్నా రు. విశ్వటోర్నీ ఫైనల్ చివరి ఓవర్లో న్యూజిలాండ్ ఫీల్డర్ గప్టిల్ త్రో వేయడంతో... పరుగు పూర్తి చేసేందుకు డైవ్ చేసిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ స్టోక్స్ బ్యాట్‌కు బంతి తగిలి బౌండరీ చేరింది. దీంతో అంపైర్ ధర్మసేన ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు ఇచ్చాడు. దీంతో ఆ మ్యాచ్ టై కావడం.. సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమం కావడంతో బౌండరీలు ఎక్కువ బాదిన ఇంగ్లండ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

294

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles