జోస్య, గుణవర్దనె పై ఐసీసీ వేటు


Sat,May 11, 2019 04:54 AM

Avanka
దుబాయ్: శ్రీలంక మాజీ క్రికెటర్లు నువాన్ జోస్య, అవిష్క గుణవర్దనెపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తాత్కాలిక వేటు వేసింది. యూఏఈలో గతేడాది జరిగిన టీ10 లీగ్‌లో అవినీతికి పాల్పడినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ విషయంలో 14 రోజుల్లోగా స్పందించాలని ఐసీసీ శుక్రవారం స్పష్టం చేసింది. యూఏఈ వేదికగా గత డిసెంబర్‌లో జరిగిన టీ10 లీగ్‌లో ఆడిన జోస్య, గుణవర్దనె ఐసీసీ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. ఇందులో అర్టికల్ 2.1.1 ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసేలా వ్యవహరించినట్లు బయటపడింది. గతేడాది నవంబర్‌లో అవినీతి నిరోధక కోడ్ కింద మూడు తప్పిదాలకు పాల్పడినందుకు ఇప్పటికే జోస్య సస్పెన్షన్ ఎదుర్కొంటున్నాడు. అయితే ఇవి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు మళ్లీ అతిక్రమించినట్లు తేలింది అని ఐసీసీ పేర్కొంది.

218

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles