నేను కోహ్లీని!


Mon,November 11, 2019 03:08 AM

Warnerdaughter
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ముద్దుల కూతురు ఇవీ మే టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై అభిమానా న్ని బయటపెట్టింది. తండ్రితో క్రికెట్ ప్రాక్టీ స్ చేస్తున్న సమయం లో చిట్టి చేతులతో బ్యాటింగ్ చేస్తూ ఐయామ్(నేను) విరాట్ కోహ్లీ అంటూ ముద్దుగా అరిచింది. ఈ వీడియోను వార్నర్ భార్య క్యాండిస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ అమ్మాయి(కూతురు) ఎక్కువ సమయం భారత్‌లో ఉంది. అందుకే విరాట్ కోహ్లీలా అవ్వాలనుకుంటుంది అని రాసింది. ఐపీఎల్‌లో తన తండ్రి వార్నర్ ఆడే సమయంలో ఇవీ చాలాసార్లు మైదానంలో సందడి చేసింది. ఆసీస్ మ్యాచ్‌లకు సైతం హాజరవుతూ తండ్రిని ఉత్సాహపరుస్తుంటుంది.

311

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles