సొగసైన బ్యాటింగ్ యువీదే: అక్తర్


Wed,June 12, 2019 12:33 AM

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. యువీ... ఓ రాక్‌స్టార్, ఓ మ్యాచ్ విన్నర్, నాకు మంచి మిత్రుడు. యువరాజ్ కంటే సొగసైన, తెలివైన లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్ భారత్‌కు మరొకరు దొరుకుతారని నేను అనుకోవడం లేదు. అతడు చాలా సులువుగా, ధాటిగా ఆడగలడు. 2003 ప్రపంచకప్‌లో భాగంగా సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో అతడిని మొదటిసారి చూశా. క్రికెట్‌పై అతడికి ఉన్న జ్ఞానానికి ఫిదా అయ్యా. ఆరు బంతులను యువీ ఆరు సిక్సర్లుగా మలిచిన వైనం నమ్మశక్యం కానిది. అని అక్తర్ అన్నాడు.

158

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles