బ్లాక్‌మెయిల్ చేస్తున్నది


Wed,May 22, 2019 02:53 AM

- సోదరిపై అథ్లెట్ ద్యుతీ చంద్ ఆరోపణ
Dutee
భువనేశ్వర్: టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్న విషయాన్ని బయటపెట్టిన భారత స్టార్ అథ్లెట్ ద్యుతీ చంద్.. సొంత కుటుంబ సభ్యులే డబ్బుల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించింది. అమ్మాయితో సంబంధానికి అంగీకరించని తన సోదరి సరస్వతి రూ.25 లక్షలు అడుగుతున్నదని ద్యుతి పేర్కొంది. ఈ అంశంపై మంగళవారం ఆమె మాట్లాడుతూ.. అడిగినప్పుడల్లా డబ్బులివ్వలేదని మా అక్క నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నది. కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయడం లేదంటూ మా అమ్మ చెప్పిన మాటల్లో వాస్తవం లేదు. నా బాధ్యతలేంటో నాకు తెలుసు. వారికోసం ఎంత చేయాలో అంత చేస్తున్నా.. అయినా వారు నన్ను వేధిస్తున్నారు. ఒకసారి ఈ విషయం బయటపడితే పరుగుపై దృష్టిసారించలేనని అక్క నన్ను భయపెడుతూ వచ్చింది. అందుకే నేను నా బంధం గురించి ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది అని పేర్కొంది.

355

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles