గంటలో లక్షా 23 వేల కిక్స్


Sun,August 13, 2017 12:33 AM

thaikwando
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రత్యేక ప్రతినిధి: తైక్వాండో క్రీడలో భాగ్యనగరానికి మరో గిన్నిస్ రికార్డు లభించనుంది. శనివారం 49 మంది సభ్యుల బృందం ఒక గంట లో లక్షా 23 వేల 79 కిక్స్ నమోదు చేసి కొత్త రికార్డును నెలకొల్పినట్లు తెలంగాణ తైక్వాండో బోర్డు కార్యదర్శి బొబ్బిలి తెలిపారు. గతంలో 49 మంది సభ్యులు కలిసి గంటలో 58000 కిక్స్‌తో గిన్నిస్ రికార్డు నెలకొల్పగా.. నగరంలోని బోడుప్పల్ పల్లవి మోడల్ స్కూల్‌లో జరిగిన ఈవెంట్‌లో మన బృందం ఈ రికార్డును సవరించినట్లు ఆయన తెలిపారు. ఈ రికార్డుకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలను గిన్నిస్ బుక్ అధికారులకు పంపామని..త్వరలోనే అధికారిక గుర్తింపు రానున్నట్లు చెప్పారు.

235

More News

VIRAL NEWS