ఆర్‌ఎఫ్‌సీ రేసుకు హైదరాబాద్ రేసర్లు రెఢీ


Fri,July 20, 2018 12:26 AM

-5వ ఎడిషన్‌లో 7 జట్లు..దేశవ్యాప్తంగా 41 జట్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: అత్యంత కఠినమైన మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌గా పిలిచే రెయిన్ ఫారెస్ట్ చాలెంజ్ (ఆర్‌ఎఫ్‌సీ) 5వ ఎడిషన్ రేసులో ఈసారి హైదరాబాద్ నుంచి 7 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 28వ తేదీవరకు గోవాలో జరిగే ఈ రేసులో ఎన్ అభివనవ్ రెడ్డి(కో డ్రైవర్ అరుణ్), చైతన్య చల్లా(కో డ్రైవర్ శబరీష్), క్రాంతి కుమార్(కో డ్రైవర్ ధన్‌రాజ్‌రెడ్డి), రాజశేఖరప్రభు(కో డ్రైవర్ దల్జీత్‌సింగ్), వెంకట్(కో డ్రైవర్ కార్తీక్‌వర్మ), సంతోష్‌గౌడ్(కో డ్రైవర్ సాజు వర్ఘీస్), సుకేశ్వరరెడ్డి(కో డ్రైవర్ వరుణ్ చక్రవర్తి) పోటీ పడుతున్నారు. భారత్‌లో ఇప్పటివరకు నాలుగు సీజన్లు విజయవంతంగా ముగిసాయి. దేశంలోని వివిధప్రాంతాల నుంచి డ్రైవర్, కో డ్రైవర్‌లతో కూడిన 41 జట్లు పాల్గొంటుండగా.. ఈ రేసు విజేతకు రూ.6.90లక్షలు అందించడంతోపాటు రూ.2.69లక్షల ఎంట్రీ ఫీజు చెల్లించకుండా మలేసియాలో జరిగే ప్రధాన రేసుకు అర్హత లభించనుంది. ఇసుజు రెయిన్ ఫారెస్ట్ రేసులో ఐదో ఎడిషన్‌లో హైదరాబాద్‌కు చెందిన 18 ఏండ్ల యువ డ్రైవర్ సుకేశ్వరరెడ్డి అంత్యంత పిన్నవయసు డ్రైవర్‌గా రికార్డులకెక్కనున్నాడు.
Abinav-Reddy

268

More News

VIRAL NEWS

Featured Articles