హెచ్‌సీఏ ఎన్నికలను ఆపలేం


Thu,January 12, 2017 01:48 AM

-స్పష్టం చేసిన హైకోర్టు
HCALOGO
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఎ) ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న హెచ్‌సీఏ ఎన్నికలను నిర్వహించుకోవచ్చంటూ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియ జరుగడం లేదనీ, ఎన్నికలను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ సంఘం కార్యదర్శి జాన్ మనోజ్ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన జస్టిస్ చల్లా కోదండరామ్ నేతృత్వంలోని ధర్మాసనం.. 17న జరిగే ఎన్నికలను ఆపాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, ఎన్నికల ఫలితాలను మాత్రం తాము ఉత్తర్వులు జారీచేసే దాకా వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికోసం మాజీ క్రికెటర్ అజరుద్దీన్, మాజీ ఎంపీ వివేక్‌లు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏలో ఓటు హక్కు లే నందున అజరుద్దీన్ ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడు కాదంటూ ప్రత్యర్థి వర్గం వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరిరోజు కావడంతో, ఎవరెవరు ఎన్నికల బరిలో ఉంటారన్నది ఇదేరోజు తేలిపోనుంది.

421
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS